వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎతాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను మంగళవారం భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులోని స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద జల్లు స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. యాటలను మొక్కుగా సమర్పించారు. అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు ఆరగించారు. అలాగే మేడారం పనుల పరిశీలనకు వచ్చిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క, సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్‌లు అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రుల పర్యటన, భక్తుల రద్దీతో మేడారం సందడిగా నెలకొంది.
వనదేవతలకు భక్తుల మొక్కులు
వనదేవతలకు భక్తుల మొక్కులు
వనదేవతలకు భక్తుల మొక్కులు


