కుష్ఠు నిర్ధారణ సర్వే
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ పరిధిలో చేపట్టిన కుష్ఠువ్యాధి నిర్ధారణ ఇంటింటి సర్వేను కేంద్ర, రాష్ట్ర బృందాలు మంగళవారం పరిశీలించాయి. ఈ సందర్భంగా బృందం సభ్యులు సర్వే అంశాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు టీములుగా ఏర్పడి కుష్ఠు నిర్ధారణ సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కోరారు. గ్రామాల్లో కుష్ఠువ్యాధిపై అపోహలు తొలగించేలా కరపత్రాలు, సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. అనంతరం పీహెచ్‌సీలోని కార్యక్రమాల ప్రణాళికలు, రోజు వారీ రిపోర్టులను బృందాలు పరిశీలించాయి. ఈ కార్యక్రమంలో సెంట్రల్ టీం అబ్జర్వర్ డాక్టర్ జయంత్, లెప్రో ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కమలేశ్వర్‌రావు, స్టేట్ బృందం సభ్యులు వెంకటేశ్వర చారి, సకల రెడ్డి, శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం అధికారులు చంద్రకాంత్, వైద్యాధికారులు శ్రీకాంత్, రణధీర్, డీపీఎం సంజీవరావు, డెమో సంపత్, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిశీలించిన కేంద్ర, రాష్ట్ర బృందాలు


