
3న కార్మిక పోరాట బహిరంగ సభ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3వ తేదీన బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మిక పోరాట బహిరంగ సభను భూపాలపల్లి ఏరియాలో నిర్వహించనున్నట్లు బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు యూని యన్ కార్యాలయంలో ఆదివారం వాల్‌పోస్టర్ ఆవి ష్కరణ చేపట్టారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏరియాలోని అంబేడ్కర్ సెంటర్‌లో సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్, బొగ్గు పరిశ్రమల ఇన్‌చార్జ్ లక్ష్మారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాధవనాయక్, హాజరు కానున్నట్లు తెలిపారు.