
రామప్ప శిల్పకళ మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని భారత విదేశాంగ శాఖ, సాన్‌ఫ్రాన్సిస్‌కు చెందిన భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్‌రెడ్డి, బ్రూనై భారత హై కమిషనర్ అబ్బగాని రాము పేర్కొన్నారు. బుధవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని వారు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆల య పూజారి ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రా మప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొని యాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ, తహసీల్దార్లు గిరిబాబు, సత్యనారా యణ, ఆర్‌ఐ విజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రామప్ప ఆలయ విశిష్టతను వివరిస్తున్న
గైడ్ విజయ్‌కుమార్
రామలింగేశ్వరస్వామికి పూజలు
నిర్వహిస్తున్న భారత విదేశీ రాయబారులు
భారత విదేశీ రాయబారులు
శ్రీకర్‌రెడ్డి, రాము

రామప్ప శిల్పకళ మరుపురానిది..