
పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో జాతీయ రహదారిపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గించడంతో పేద, మధ్యతరగతి, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గృహ వినియోగ వస్తువులపై 18 శాతం ఉన్న జీఎస్టీ 5శాతానికి తగ్గించారని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వస్తువులపై 12 శాతం నుంచి 5 శాతానికి ఆరోగ్యరంగంలో 18 శాతం నుంచి 5 శాతం తగ్గించారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో చిరువ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. దీంతో ప్రధాని మోదీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. చింతలపూడి భాస్కర్‌రెడ్డి, కొత్త సురేందర్, కృష్ణాకర్, రాజ్‌కుమార్, రాకేష్‌యాదవ్, రవిరెడ్డి, సుమలత, మహేందర్, బాబు, శ్రీహరి పాల్గొన్నారు.