సందిగ్ధంలో హరిత హోటళ్లు | - | Sakshi
Sakshi News home page

సందిగ్ధంలో హరిత హోటళ్లు

Sep 6 2025 7:08 AM | Updated on Sep 6 2025 7:08 AM

సందిగ

సందిగ్ధంలో హరిత హోటళ్లు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలోని మేడారం, తాడ్వాయి, ములుగు, బొగత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హరితహోటళ్ల నిర్వహణ సందిగ్ధంగా మారింది. టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హరితహోటళ్లను గుజరాత్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ లీజుకు తీసుకుని పెరియాడో రిసార్ట్స్‌ పేరుతో నిర్వహించింది. అయితే గురువారం రాత్రి తాడ్వాయిలోని హరి తహోటల్‌ నుంచి రెండు కంటైనర్లలో నిర్వాహకులు సామగ్రిని తీసుకెళ్లారు. లీజుకు తీసుకున్న హరితహోటళ్లను వదులుకున్నట్లు తెలుస్తుంది. అయితే పెరియాడో రిసార్ట్స్‌లో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలల వేతనాలు చెల్లించలేదు. ఈక్రమంలో హరితహోటల్‌ ఖాళీ చేస్తున్నట్లు తెలిసి వేతనాల విషయంపై సంబంధిత ఎండీని సిబ్బంది అడగగా తర్వాత చెల్లిస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. వారు వెళ్లిపోవడంతో సిబ్బంది శుక్రవారం హరితహోటల్‌ మెయిన్‌ గేట్‌కు తాళం వేశారు. మేడారం, బొగత, తాడ్వాయి పెరియాడ్‌ రిసార్ట్స్‌లో పని చేసిన సిబ్బంది అందరూకలిసి జీతాలు ఇప్పించాలని తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హరితహోటళ్లను లీజుకు తీసుకున్న ప్రైవేట్‌ సంస్థ టూరిజంశాఖకు లీజు బకాయిలు కూడా చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. దీంతో మళ్లీ హరిత హోటళ్లు తెరుచుకుంటాయా.. లేదా.. అనే సందేహాలు పర్యాటకుల్లో వ్యక్తమవుతున్నాయి. పెరియాడో రిసార్ట్స్‌ సంస్థ వారు ఖాళీ చేయడంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా టూరిజంశాఖ అధికారులు హరితహోటళ్లు అందుబాటులోకి తీసుకొస్తారా.. లేదా.. వేచిచూడాలి. కాగా టూరిజంశాఖ అధికారులు హరితహోటల్‌ను సందర్శించి సిబ్బందితో మాట్లాడినట్లు తెలిసింది. ఈవిషయంపై టూరిజంశాఖ ఈడీ ఉపేందర్‌రెడ్డిని వివరణ కోరగా హరిత హోటల్‌ లీజుకు తీసుకున్న సంస్థ బకాయిలు చెల్లించాల్సి ఉంది. లీజ్‌ బకాయిలు చెల్లించాని గతంలోనే 15 రోజుల గడువు ఇస్తూ నోటీస్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 3వ తేదీతో గడువు ముగిసిందని.. బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వేతనాలు చెల్లించలేదని సిబ్బంది తాళం

పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

సందిగ్ధంలో హరిత హోటళ్లు1
1/1

సందిగ్ధంలో హరిత హోటళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement