
వానగుట్ట ప్రాంతంలోనే పులి మకాం
వెంకటాపురం(ఎం): జిల్లాలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న పులి శుక్రవారం సా యంత్రం వరకు వెంకటాపురం(ఎం) మండలంలోని వానగుట్ట అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ములుగు మండలంలోని పత్తిపల్లి, పోట్లాపూర్ సమీప అడవుల్లో సంచరించిన పులి.. గట్టమ్మ మీదుగా గురువారం వెంకటాపురం(ఎం) మండలంలోకి ప్రవేశించింది. శుక్రవారం ఉదయం సింగరకుంటపల్లె రోడ్డు దాటుతూ వానగుట్ట వైపు వెళ్లినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ములుగు ఎఫ్‌ఆర్‌ఓ శంకర్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వానగుట్ట సమీపంలో పులి పాదముద్రలను గుర్తించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ శంకర్ తెలిపారు. పులి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
గాలింపు చర్యలు చేపట్టిన
అటవీశాఖ అధికారులు

వానగుట్ట ప్రాంతంలోనే పులి మకాం