
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
ఏటూరునాగారం: మండలంలోని ముళ్లకట్ట వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి దేవరా జ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ముళ్లకట్ట వద్ద గజ ఈతగాళ్లతో పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. మండల స్పెషల్ అధికారి శ్రీపతి, ఎంపీడీఓలు శ్రీనివాస్, శ్రీకాంత్, ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఉన్నారు
హైదరాబాద్‌కు తరలిన
జీపీఓలు
ములుగు: జిల్లాలో నూతనంగా ఎంపికై న జీపీఓలు (గ్రామ పంచాయతీ పాలన అధికారులు) నియామకపత్రాలు అందుకునేందుకు శుక్రవారం హైదరాబాద్ వెళ్లారు. ములుగు కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సులో 50 మంది జీపీఓలు తరలివెళ్లేందుకు అదనపు కలెక్టర్ మహేందర్ జీ చర్యలు తీసుకున్నారు.
పీఆర్టీయూ
జిల్లా కమిటీ ఎన్నిక
ములుగు: తెలంగాణ పీఆర్టీయూ జిల్లా కమిటీని జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆంథోని స్కూల్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రౌతు రాజు శుక్రవా రం వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా కొయ్యడ సురేందర్, ప్రధాన కార్యదర్శిగా పోరిక రామ న్న, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బానోతు రాజేశ్వరి, జిల్లా కార్యదర్శిగా ఇరుసవడ్ల కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా సారంగపాణి, ఉపాధ్యక్షులుగా రమేష్, చందన, భారతి ఎన్నికై నట్లు తెలిపారు.
ఆశ కార్యకర్తల కమిటీ..
ఏటూరునాగారం: మండలం కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ ఆశ కార్యకర్తల వర్క ర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా మూడో మ హాసభ శుక్రవారం నిర్వహించి, నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలుగా మడే శ్రావ్య, ప్రధాన కార్యదర్శిగా ర త్నం నీలాదేవి, కోశాధికారిగా ప్రభావతి, ఉపాధ్యక్షులుగా చుంచు మంజుల, పాప, సంధ్య, బొగ్గం సరిత, నాగమణిలతోపాటు సుధ, నాగమణి, సరిత, వెంకటరమణ భాగ్యలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎన్నిక ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు దావూద్, రత్నం రాజేందర్, మాధవి, గుండెబోయిన రమాదేవి, రాజ్యలక్ష్మి, రాధ, రజిత, దేవి, నళి ని, కుమారి, సుగుణ, పూర్ణ, కాక రాణి, రమాదేవి, ఖాసింబీ, చంద్రకళ, రజినీ, కవిత, రజిత , రమాదేవి, జానకి, జ్యోతి పాల్గొన్నారు.
తాగునీటి కోసం
జీపీ ఎదుట నిరసన
మంగపేట : మండలంలోని మల్లూరులో పంచాయతీ పరిధిలోని ముస్లింవాడ, మెట్టుగూడెం తదితర ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఆగస్టు 8 నుంచి తాగునీరు సక్రమంగా రాలేదని.. పంచాయతీ అధికారులకు చెప్పినా.. పట్టించుకోవడం లేదని ఈసందర్భంగా ప్రజలు ఆరో పించారు. వెంటనే తాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి అజ్మత్‌ను వివరణ కోరగా.. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి సమస్య ఏర్పడిందని తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని, భగీరథ నీరు అందేవరకు వాటర్ ట్యాంక్ ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు.

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన