
నవ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలి
ములుగు: నవ సమాజ నిర్మాణానికి యువత నడుం బిగించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడి నవసమాజ నిర్మాణ ఏర్పాటుకు పాటుపడాలన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు నో చెప్పి, బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునేందుకు ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు. దూమపానం, గంజాయి, మద్యపానం, కొకై న్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొందరు చెడు అలవాట్లతో మానసిక ఒత్తిడికి గురై చదువు, ఆటల్లో రాణించలేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్, ఆరోగ్య కార్యకర్త రవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు