
బీజేపీ జిల్లా కమిటీ ఎన్నిక
ములుగు రూరల్: బీజేపీ జిల్లా కమిటీ ఎన్నికను జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆదేశాల మేరకు కమిటీని నియమించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ జిల్లా పదాధికారులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాయకులు బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలలో పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని సూచించారు. నూతన కమిటీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా జినుకల కృష్ణాకర్, రవీందర్‌రెడ్డి, అల్లెం శోభన్, మద్దినేని తేజరాజు, ప్రధాన కార్యదర్శులుగా నగరపు రమేష్, రవీంద్రాచారి, జాడి వెంకట్, కార్యదర్శులుగా సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, జ్యోతి, మధు, లవన్‌కుమార్, మహాలక్ష్మీ, కోశాధికారిగా రాజ్‌కుమార్, కార్యాలయ కార్యదర్శిగా విశ్వనాధ్, మీడియా కన్వీనర్‌గా శ్యాంప్రసాద్‌లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, భూక్య రాజు నాయక్, భూక్య జవహర్‌లాల్, గుగులోత్ స్వరూప, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.