
అనుమతులు తప్పనిసరి
ములుగు రూరల్: వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్ఠించే కమిటీలు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ శబరీశ్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నెలవారి నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. మండపాల్లో నిర్వహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్ల గురించి ఆరా తీసి వివరాలు అప్టేడ్ చేయాలన్నారు. కోర్టు ట్రయల్‌లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. ప్రతీ కేసులో తప్పనిసరిగా సాక్షులకు, ముద్దాయిలకు సమాన్లు అందించాలన్నారు. ఈ నెలలో నమోదైన కేసుల వివరాలను స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శంకర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కుమార్, సీఐలు శ్రీనివాస్, సురేష్, రమేష్, దయాకర్, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలు పాల్గొన్నారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
విధి నిర్వహణలో పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సాయుధ దళ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీ సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. అధికారులు నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కార్యాలయంలో రికార్డులను పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. బీడీ టీం కార్యాలయంలో అత్యాధునిక పరికరాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. మోటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఆర్‌ఐలు స్వామి, సంతోష్, వెంకటనారాయణ, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ శబరీశ్