
తెగిన పెద్దచెరువు కట్ట.. నీట మునిగిన పొలాలు
గోవిందరావుపేట: మండలంలో 20సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో రంగాపూర్‌లోని పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో చెరువులోని నీళ్లు పక్కనే ఉన్న వాగులో కలిసిపోయాయి. ముంపు ప్రాంతమైన ప్రాజెక్టు నగర్‌లోని 15 కుటుంబాలను ఎస్పీ డాక్టర్ శబరీశ్ పునరావాస కేంద్రానికి తరలించి వారికి పండ్లు, బిస్కెట్లు, తాగునీటిని పంపిణీ చేశారు. కలెక్టర్ శబరీశ్ సైతం గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షాలు, వరదలు తగ్గేవరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
రంగాపూర్‌లో తెగిన పెద్ద చెరువు కట్ట
చెరువును తలపిస్తున్న పంట పొలాలు

తెగిన పెద్దచెరువు కట్ట.. నీట మునిగిన పొలాలు