
రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్
రేగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం గోస పడుతుందని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మి ఓట్లేస్తే .. రైతులను నడి రోడ్డున నిలబెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆదివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం సాగు అవసరాలపై ముందు చూపు లేకపోవడమే రైతుల కష్టానికి కారణమన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.