
స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం: స్కావెంజర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జిల్లా పరిషత్ పాఠశాలల స్కావెంజర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యనమల ప్రవీణ్‌కుమార్ అన్నా రు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కా వెంజర్ల జిల్లా కమిటీ ఎన్నిక, సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలిపారు. స్కావెంజర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పిల్లల సంఖ్య ఆధారం కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా వాసం ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా మానస, ఇర్ప రాధికలను ఎన్నుకున్నారు.
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్