
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
భూపాలపల్లి అర్బన్: ఆదాయాన్ని రాబట్టి లాభాల బాటపట్టేలా అన్ని మార్గాలను ఆర్టీసీ యాజమాన్యం అన్వేషిస్తోంది, గతంలో ప్రయాణికుల సమస్యలను అంతగా పట్టించుకోని ఆర్టీసీ నేడు ప్రయాణికులకు చేరువయ్యేందుకు వినూత్న సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి వినోద, విహరయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించే చర్యల్లో నిమగ్నమైంది. ఆదాయానికే పరిమితం కాకుండా ప్రయాణికుల కుటుంబాలకు సైతం వినోదం, విహరయాత్రలను పంపించేందుకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. ఇది వరకే ప్రయాణికులను ఆదరించేలా ప్రతి డిపోలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్య విధుల్లో తీరికలేకుండా గడిపే వారికి కాలక్షేపం కోసం, తీర్థయాత్రలపై ఆసక్తి ఉన్న వారికోసం ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నది తెలుసుకొని ఈ యాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా యాత్ర వివరాలు, తేదీలు, చార్జీలను ప్రకటించి ప్రయాణికులు పేరు నమోదు చేసుకునే విధంగా ప్రచారం చేపడుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఈ నెలలో 4 టూర్ ప్యాకేజీల వివరాలను ప్రారంభించారు.
విహర, వినోద యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ నెలలో నాలుగు రూట్లలో బస్సులు నడపడానికి ప్రణాళికలు రూపొందించాం. ముందస్తుగా డిపోలో పేర్లు నమోదు చేసుకొని సీట్లు రిజర్వేషన్ చేసుకోవాలి.
– ఇందూ, డిపో మేనేజర్, భూపాలపల్లి
ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు
ఆదాయ పెంపునకు అధికారుల చర్యలు
ఈ నెలలో మూడు టూర్లకు ప్యాకేజీలు సిద్ధం