
కోతకు గురైన ఎన్‌హెచ్
తాడ్వాయి– పస్రా మార్గంలోని మొండ్యాల తోగు వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి భారీగా కోతకు గురైంది. ఈరోడ్డు మార్గన నిత్యం వందలాది వాహనాలు నడుస్తుడడంతో ప్రమాదాలకు గురికాకుండా తాడ్వాయి పోలీసులు భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మండలంలోని ఊరట్టం తూముల వాగు వరద తాకిడికి బ్రిడ్జి సమీపంలో రోడాం వద్ద సీసీ రోడ్డు కోతకు గురైంది. అలాగే మండల కేంద్రంలోని తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే దారిలోని కామారం బ్రిడ్జి సమీపంలో తారు రోడ్డు కూడా ధ్వంసమైంది. వాహనదారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అకారణంగా ప్రజలు వాగులు దాటి రావొద్దని వెంగ్లాపూర్, నార్లాపూర్, చింత క్రాస్ వద్ద రోడ్ల వెంట ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.