
రైతులు ఆందోళన చెందొద్దు
ములుగు రూరల్: రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఆగస్టు నెల వరకు యూరియా 10వేల 20 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని ఈ ఏడాది 10 వేల 720 మెట్రిక్ టన్నులు రైతులకు అందించినట్లు వెల్లడించారు. నేడు జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల యూరియా, 31న 500 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు వివరించారు. సెప్టెంబర్ నెలలో రైతులకు 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా ఎస్సై కమలాకర్ ఎస్పీ శబరీశ్ నుంచి ఉత్తమ ఎస్సైగా ప్రశంసపత్రం, నగదు రివార్డును మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ నేర పరిశోధనలో ప్రతిభ కనబర్చి పలు కేసులను చాకచాక్యంగా పరిష్కరించిన పోలీసులను గుర్తించి నగదు బహుమతులు, రివార్డులు అందించినట్లు తెలిపారు. ఉత్తమ ఎస్సైగా అవార్డు, నగదు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, వీటిని అందజేసిన ఎస్పీ శబరీశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైని డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్, సిబ్బంది అభినందించారు.
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో షాపులు నడుపుకునేందకు లైసెన్స్ హక్కుల కోసం ఈ– టెండర్, సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం ద్వారా ఈఓ మహేష్ ఆధ్వర్యంలో నాలుగు టెండర్లు నిర్వహించారు. మంగళవారం టెండర్లకు పర్యవేక్షణాధికారిగా నందనం కవిత పర్యవేక్షణలో స్వీట్ హౌస్ నడుపుకునేందుకు రూ.3.40లక్షలు, పూలదండలు, పూలు, పండ్లు అమ్ముకొను హక్కు రూ.9లక్షలు, సులభ్ కాంప్లెక్స్ నడుపుకునేందుకు రూ.70వేలు, భక్తుల ఫొటోలు తీసుకునేందుకు రూ.1.20లక్షల హెచ్చు పాట వచ్చినట్లు ఈఓ తెలిపారు. టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ. 14.30 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న నిరసన దిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ బూరుగు రవికుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో టీజీఈ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఉదయం 11 గంటలకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 8న ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే బస్సు యాత్రలో ఉద్యోగులు పాల్గొనాలని పిలుపుని చ్చారు. అనంతరం వాల్‌పోస్టర్ ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు విజయలక్ష్మి, సుభాకర్‌రెడ్డి, అశోక్, తిరుపతి, సేవానాయక్, రఘుకుమార్, శంకర్, విజయ్, మొండయ్య, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాళేశ్వరం: శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానంలో మట్టి గణపతి విగ్రహాలను మంగళవారం ఉచితంగా పంపిణీ చేసినట్లు ఈఓ మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ, వెల్ది శరత్‌చంద్రశర్మ, జూనియర్ అసిస్టెంట్‌లు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు