
యూరియా కోసం బారులు
పాలంపేటలో యూరియా కోసం క్యూలో ఉన్న రైతులు
లక్ష్మీదేవిపేటలో క్యూలో చెప్పులు పెట్టిన రైతులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో యూరియా కోసం రైతులు ఆదివారం బారులుదీరారు. పాలంపేటలో పీఏసీఎస్ కార్యాలయ ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు క్యూ కట్టగా ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. అలాగే లక్ష్మీదేవిపేటలో రైతులు తమ చెప్పులను క్యూలో ఉంచారు. ఈ సందర్భంగా ఏఓ శైలజను సాక్షి వివరణ కోరగా యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు ముందస్తుగా యూరియాను నిల్వచేసుకోవడం మూలంగానే ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.

యూరియా కోసం బారులు