
గణపతి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
ఏటూరునాగారం: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈనెల 27 నుంచి తొమ్మిది రోజు పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ముందస్తు ముందస్తు చర్యల్లో భాగంగా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, ము స్లిం మైనార్టీ సభ్యులు, ఆలయ చైర్మన్‌లతో ఏఎస్పీ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక వి గ్రహాలు ప్రతిష్ఠించే ప్రతీ ఒకరు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ప్రతి మండపంలో సీసీ టీవీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలని, మండలపాల దగ్గర విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రతీరోజు రాత్రి ఇద్దరు మండపాల దగ్గర విధిగా ఉండాలన్నారు. గణేష్ విగ్రహ నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్డుపై నిరుపయోగంగా ఉన్న వాహనాలను వెంటనే తొలగించాలని తెలిపారు. విద్యుత్ తీగలను సరిచేసే విధంగా విద్యుత్‌శాఖ వారితో సమన్వయం చేసుకోవా లని సూచించారు. భక్తి శ్రద్ధలతో నిమజ్జనం ఊరేగింపు జరుపుకునేందుకు అన్ని కమిటీల సభ్యులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. నిమజ్జ నం కోసం ముళ్లకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ట్లు తెలిపారు. సమావేశంలో సీఐ అనుముల శ్రీని వాస్, ఎస్సై రాజ్‌కుమార్, ట్రెయినీ ఎస్సైలు నరేష్, రచిత్ర రామాలయం కమిటీ చైర్మన్ అలువాల శ్రీని వాస్, సాయిబాబా కమిటీ చైర్మన్ ప్రభా కర్, హనుమాన్ అర్చకులు యల్లాప్రగడ సూర్యనారాయణశర్మ, గణపతి కమిటీ సభ్యులు, మజీద్ అధ్యక్షుడు అఫ్జల్‌పాషా, సర్కార్, అజ్మత్‌ఖాన్ పాల్గొన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ