
మేడారంలో ముగిసిన పొట్ట పండుగ
డోలివాయిద్యాలతో గుడికి వెళ్తున్న పూజారులు
భక్తుల పైనుంచి దాటుకుంటూ వెళ్తున్న పూజారులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో సమ్మక్క పూజారులు రెండు రోజుల పాటు పొట్ట పండుగను ఘనంగా నిర్వహించారు. బుధవారం మొదలైన పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు గురువారంతో ముగిశా యి. బుధవారం రాత్రి సమ్మక్క గుడి నుంచి పసు పు, కుంకుమలు, పూజా సామగ్రి తీసుకుని గద్దెలకు వెళ్లిన పూజారులు రాత్రంతా సంబురాలు చేసుకుని గురువారం ఉదయం గద్దెల వద్ద నుంచి పూజా సామగ్రిని తీసుకుని బూర కొమ్ముల శబ్ధాలు, డోలి వాయిద్యాలతో గుడికి వెళ్లారు. సమ్మక్క గద్దె నుంచి పూజారులు బయల్దేరిన సమయంలో భక్తులు, స్థా నిక ఆదివాసీ యువతీయువకులు దారిపొడువునా పడుకోవడంతో పూజారులు వారిపైనుంచి దాటి వెళ్లారు. అనంతరం సమ్మక్క గుడిలో పూజారులు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
మొక్కజొన్న కంకులు.. వరి పొట్ట నైవేద్యం
పొట్టకు వచ్చిన మొక్కజొన్న కంకులు, వరి పొట్టను అమ్మవారికి పూజారులు నైవేద్యంగా సమర్పించారు. యాటను బలి ఇచ్చారు. అమ్మవారికి కొత్త ధాన్యాన్ని సమర్పించిన తర్వాతే స్వీకరిస్తామని పూజారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు పొట్ట పండుగ పూజా కార్యక్రమాలతో మేడారంలో సందడి వాతావరణం నెలకొంది.
గద్దెల నుంచి గుడికి వెళ్లిన పూజారులు
పొట్టకు వచ్చిన ధాన్యం అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ

మేడారంలో ముగిసిన పొట్ట పండుగ