
వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని, స్టోర్ రూం, కిచెన్ షెడ్‌లను పరిశీలించారు. అనంతరం వైద్యశిబిరంలో 35 మందికి పరీక్షలు నిర్వహించగా 10 మంది జ్వరంతో బాధపడుతున్నారన్నారు. వారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ ప్రొవైడర్ నవ్య, డెమో సంపత్, పాఠశాల ప్రిన్సిపాల్ నర్మదాబాయి, వైస్ ప్రిన్సిపాల్ స్వాతి, హెల్త్ సూపర్‌వైజర్ జయశ్రీ పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం(ఎం) మండలంలోని ఇంచెంచెరువుపల్లిలోని వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నీటి నిల్వలపై మూతలు పెట్టుకోవాలన్నారు.అనంతరం ప్రాథమిక పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డెమో సంపత్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ సంఘమిత్ర, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.