
పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి
ములుగు రూరల్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం(కేజీకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి గుండబోయిన రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరును నామకరణం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలలో రద్దు చేసిన గీత సొసైటీలను తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర శ్రీనివాస్, మధుకర్, సాగర్, కై రి మొగిలి, రమేష్, రఘుపతి, జనార్ధన్, గుండమీది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కేజీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి