
అలుగు పోస్తున్న లక్నవరం, గుండ్లవాగు ప్రాజెక్టు
గోవిందరావుపేట: మండలంలోని లక్నవరం సరస్సు సామర్థ్యం 33 ఫీట్ల 6 ఇంచులు కాగా శనివారం సాయంత్రం వరకు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. అదే విధంగా గుండ్లవాగు ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 25 ఫీట్లు కాగా పది రోజుల కిందటనే పూర్తిగా నిండి మత్తడి పోస్తుంది. లక్నవరం సరస్సు నీటి నిల్వ 1.945 టీఎంసీలు కాగా అధికారికంగా 8,794 ఎకరాల్లో వరి సాగు అవుతుండగా అనధికారికంగా 12 వేల ఎకరాలకు లక్నవరం చెరువు నీరు అందుతుంది. ప్రతిఏటా లక్నవరం చెరువు నీటితో రెండు పంటలు పండుతుంటాయి. అదే విధంగా గుండ్లవాగు ప్రాజెక్ట్ నీటితో 4,500 ఎకరాల్లో వరి పంట సాగు అవుతుంది.

అలుగు పోస్తున్న లక్నవరం, గుండ్లవాగు ప్రాజెక్టు