
జలదిగ్బంధంలో పడిగాపూర్, ఎల్బాక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: నార్లాపూర్ చింతల్ క్రాస్ రోడ్డు నుంచి ఎల్బాకకు వెళ్లే దారిలో జంపన్నవాగు లోలెవల్‌కాజ్‌వే పైనుంచి వరద ప్రవహించడంతో ఎల్బాక, పడిగాపూర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు మేడారానికి వచ్చేందుకు ఉన్న మరో దారిలోని కొంగల మడుగు వరద రోడ్డుపైకి భారీగా వచ్చి చేరడంతో అటువైపు నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. అంతేకాకుండా ఊరట్టం తూముల వాగు వరద కూడా బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండడంతో ఊరట్టం గ్రామానికి సైతం రాకపోకలు నిలిచిపోయాయి.