
ఉధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగు
న్యూస్‌రీల్
ఉరకలేస్తున్న జంపన్నవాగు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో మేడారంలోని జంపన్నవాగుతో పాటు పలు ప్రాంతాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంపన్నవాగు పొంగిపొర్లడంతో మేడారం బ్రిడ్జిని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది.
దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మేడారంలోని చిరు వ్యాపారులను అధికారులు అప్రమత్తం చేశారు. మేడారానికి వచ్చే భక్తుల భద్రత కోసం పోలీసు అధికారులు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వర్షాలు పడితే ఏక్షణంలోనైనా వరద పెరిగే ప్రమాదం ఉందని దుకాణాలను ఖాళీ చేయాలని చిరు వ్యాపారులకు సూచించారు.