
రేపటి నుంచి మెస్‌లు రీఓపెన్
కేయూలోని వివిధ హాస్టళ్లు, మెస్‌లు రేపటి (సోమవారం) నుంచి రీఓపెన్ చేయనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు.
రోడ్డుపైకి చేరిన యాసంగితోగు వరద
పస్రా నుంచి మేడారానికి వచ్చే దారిలోని ప్రాజెక్టునగర్– వెంగ్లాపూర్ మధ్య ఉన్న యాసంగి తోగు వరద రోడ్డును కమ్మేయడంతో పస్రా నుంచి మేడారానికి శనివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం నుంచి హనుమకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సు కూడా రోడ్డుపైకి వరద రావడంతో తిరిగి మేడారం నుంచి తాడ్వాయి మీదుగా వెళ్లింది. హనుమకొండ నుంచి మేడారానికి వచ్చే భక్తుల వాహనాలను పస్రా నుంచి తాడ్వాయి మీదుగా మేడారానికి పోలీసులు దారి మళ్లించారు. యాసంగితోగు వరద తగ్గుముఖం పట్టేంత వరకు ఈమార్గన రాకపోకలు కొనసాగే పరిస్థితి లేదు.