
సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ
అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకోనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్‌లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది.
– జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరం
రాజకీయ నాయకులకు అక్రమ సంపాదనపై ఉన్న మక్కువ దేశాభివృద్ధిపై లేదు. స్వార్థపు ఆలోచనలతోనే బతుకుతున్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి? అనుకుంటున్నారు. తోటి మిత్రులకు, పేదలకు, ఇతరులకు సాయం అందించినప్పుడు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. పదిమంది చేసే పనిని ఒక ఏఐ చేస్తే మిగతావారి పొట్టకొట్టినట్లే కదా. ఏఐలో మానవ మనుగడకు ముప్పే.
– ఎస్‌కే అన్వర్, బీఏ, తృతీయ సంవత్సరం

సమరయోధుల త్యాగాలతోనే స్వేచ్ఛ