
వంతెన పనులు త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: మల్లంపల్లి–ములుగు జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కుంగిపోవడంతో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్. దివాకర సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారిపై ఉన్న పాత బ్రిడ్జి కుంగిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగిందన్నారు. జాతీయ రహదారి అధికారులు తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వాహనాల రాకపోకలను దారి మళ్లించాలని తెలిపారు. వరంగల్ నుంచి ములుగు వచ్చే భారీ వాహనాలను గూడెప్పాడు నుంచి పరకాల.. రేగొండ.. జంగాపల్లి మీదుగా వెళ్లేలా చూడాలన్నారు. తిరుగు ప్రయాణంలో అబ్బాపూర్..గోరుకొత్తపల్లి..వరంగల్‌కు వెళ్లేలా చూడాలన్నారు. నర్సంపేట, ములుగు, వరంగల్ ఆర్టీసీ బస్సులు, కార్లు శ్రీనగర్–పందికుంట మీదుగా మళ్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎన్‌హెచ్ అధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర