హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ

Aug 14 2025 7:45 AM | Updated on Aug 14 2025 7:45 AM

హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ

హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ

ములుగు రూరల్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ప్రారంభమై ములుగు ఏరియా వైద్యశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లాడుతూ హర్‌ఘర్‌ తిరంగా ర్యాలీ ఒక కార్యక్రమం కాదని.. ఇది మన బాధ్యత అని తెలిపారు. స్వాతంత్య్ర యోధులకు మనమిచ్చే నివాళి అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌ రెడ్డి, రమేష్‌, సురేందర్‌, రవీంద్రచారి, రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ములుగులో నిర్వహిస్తున్న ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement