బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 13 2025 5:22 AM | Updated on Aug 13 2025 5:22 AM

బుధవా

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

8లోu

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది

ఇంటర్నల్‌ మార్కుల విధానంతో విద్యార్థులు సొంతంగా ప్రాజెక్టులు తయారు చేయడం, స్లిప్‌ టెస్టులు, నోట్స్‌ రాయడం ద్వారా నైపుణ్యాలు పెరిగి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలల్లో ఇంటర్నల్‌ మార్కుల విధానం అమలులో ఉంది. ఇంటర్నల్‌ మార్కుల విధానం విద్యార్థుల ప్రగతికి దోహదపడుతుందని ఎన్‌సీఈఆర్‌టీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.

– జనగాం బాబురావు, ఎస్సీ, ఎస్టీ

ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వ నిర్ణయంతో

గందరగోళ పరిస్థితులు

విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత విద్యాశాఖ ఇంటర్నల్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్నల్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో 100 మార్కులకు విద్యార్థులను రెండు నెలలుగా సన్నద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నల్‌ విధానాన్ని రద్దు చేసి 100 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహించాలి.

– ఏళ్ల మధుసూదన్‌,

ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

పాత పద్ధతిలోనే

పది పరీక్షలు

వెంకటాపురం(ఎం): పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్‌ 20 మార్కులను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిన తర్వాత విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంపై మరికొంతమంది ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలపై ప్రభుత్వానికే స్పష్టత లేకపోతే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్‌ నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు 20 కి 20 ఇంటర్నల్‌ మార్కులు వేస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పడిపోతుందనే నెపంతో ప్రభుత్వం ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని రద్దు చేసి 2024–25 విద్యా సంవత్సరం నుంచే 100 మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని గతేడాది వెనక్కి తీసుకుంది. 2025–26 నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు గడిచిన తర్వాత పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌సీఈఆర్‌టీ అభిప్రాయం మేరకే..

పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేయడంపై జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. సీబీఎస్‌ఈ పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్స్‌, 80 శాతం వార్షిక పరీక్షలకు మార్కులు కేటాయిస్తే తెలంగాణలో ఎలా ఇంటర్నల్స్‌ను రద్దు చేస్తారని ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో చర్చించినట్లు సమాచారం. దీంతో విద్యాశాఖ అధికారులు పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం అంగీకరించగా విద్యాశాఖ అధికారులు ఇంటర్నల్‌ విధానాన్ని యధావిధిగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

10 మండలాల్లో.. 4,186 మంది విద్యార్థులు

జిల్లాలోని 10 మండలాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో కలిపి 53 హైస్కూల్స్‌ ఉండగా 2025–26 విద్యాసంవత్సరానికి గాను 4,186 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో విద్యాశాఖ 100 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టత ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయులంతా విద్యార్థులను సబ్జెక్టుల వారీగా గత రెండు నెలలుగా 100 మార్కుల పేపరుకే సన్నద్ధం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం విద్యాశాఖ 80 మార్కులకు రాత పరీక్షలు, 20 ఇంటర్నల్‌ మార్కులు అని ఆదేశాలివ్వడంతో ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. విద్యాసంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వం వార్షిక పరీక్షలపై స్పష్టత ఇవ్వాలని, విద్యా సంవత్సరం ఆరంభమైన రెండు నెలల తర్వాత వార్షిక పరీక్షలు, ఇంటర్నల్‌ మార్కులపై ఆదేశాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని కొంతమంది ఉపాధ్యాయులు అభిప్రాయపడుతుండగా, మరికొంతమంది ఉపాధ్యాయులు ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ డైరెక్టర్‌

రాత పరీక్షకు 80,

ఇంటర్నల్‌కు 20 మార్కులు

జిల్లా వ్యాప్తంగా

4,186 మంది విద్యార్థులు

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/4

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20252
2/4

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20253
3/4

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 20254
4/4

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement