సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

Aug 13 2025 5:22 AM | Updated on Aug 13 2025 5:22 AM

సమస్య

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

ఏటూరునాగారం: గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గిరిజన విద్యాసంస్థల్లో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముట్టడించారు. అనంతరం 163 జాతీయ రహదారిపై ధర్నా చేపట్టగా పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ ఎనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న మెస్‌, కాస్మోటిక్‌ బిల్లులు విడుదల కాకపోవడంతో వార్డెన్లు బంగారం కుదవపెట్టి ఆశ్రమ పాఠశాలలను నడుపుతున్నారని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల హాస్టళ్లలోని వార్డెన్లకు రోజురోజుకూ ఖర్చుల భారం పెరిగిపోతున్నా బిల్లులు మాత్రం రావడం లేదన్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో టీచర్లు లేరని, బాత్‌రూమ్స్‌, మరుగుదొడ్లు, హాస్టళ్లలో ఫ్యాన్లు పనిచేయడం లేదని తెలిపారు. పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలోనే పూర్తిస్థాయిలో బాత్‌రూమ్స్‌, మరుగుదొడ్లు, ఫ్యాన్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. బాలికల హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో మహిళలే టీచర్లు, వర్కర్లుగా ఉండాలని నిబంధన ఉన్నా అందుకు భిన్నంగా పురుషులను నియమించడం ఏమిటని ప్రశ్నించారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లోని విద్యార్థులు ఏటూరునాగారంలో ఐటీఐ, జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలకు వెళ్లివచ్చే సమయలో సరిగా బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అన్ని కళాశాలల ఉపకారవేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, డీడీ పోచంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాగటి రవితేజ, టీఎల్‌ రవి, జిల్లా ఉపాధ్యక్షుడు కోకిల బాలు, జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్‌, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి నర్సింగరావు, మండల నాయకులు రాకేష్‌, సాంబశివరావు, హేమంత్‌, జస్వంత్‌ సంతోష్‌ మహేష్‌ పాల్గొన్నారు.

ఐటీడీఏను ముట్టడించిన

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

163 జాతీయ రహదారిపై ధర్నా,

విరమింపజేసిన పోలీసులు

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం1
1/1

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement