
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి
వెంకటాపురం(కె): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి వెంకటాపురం మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ తిరుపతికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సాధనపల్లి విజయ్ మాట్లాడుతూ రెండు నెలలుగా మండలానికి బస్సు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్ధులు స్కూల్‌కు వెళ్లేందుకు ఆటోలకు రోజకు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్మోహన్‌నాయుడు, ముత్యాల శ్రీనివాస్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.