
ఉద్యోగిపై విచారణ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఉద్యోగిపై దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి విచారణ చేపట్టారు. ఉద్యోగిపై వస్తున్న ఆరోపణలపై మంగళవారం ఆరాతీశారు. దేవస్థానంలోని అర్చక, సిబ్బందితో ఆమె ప్రత్యేకంగా చర్చించి వారి వాంగ్మూలాన్ని సేకరించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాలతో ఆరోపణలు వస్తున్న ఉద్యోగిపై విచారణ చేశామని, నివేదికలు సమర్పిస్తామని తెలిపారు. ఆమెతో వరంగల్ ఏసీ సునీత, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు పనకంటి ఫణీంద్రశర్మ తదితరులు ఉన్నారు.