
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలకేంద్రంలో జాతీయ రహదారిపై నాయకులు మంగళవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మండల ఇన్‌చార్జ్ పల్లా బుచ్చయ్య హాజరై మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌లో మన సైనికుల వీరత్వానికి నిదర్శనంగా ప్రతీఇంటిపై జాతీయజెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలన్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో మేకింగ్ ఇండియాగా దేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్, రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణాకర్‌రావు, మల్లెల రాంబాబు, జిల్లా కార్యదర్శి మెడిశెట్టి ఓంమ్రా, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జంగా హన్మంతరెడ్డి, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సిద్ధబోయిన సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు