
గెజిట్ విడుదల చేయాలని వినతి
ములుగు రూరల్ : ఐదో షెడ్యూల్ ప్రకారం పరిశ్రమల జీఓల గెజిట్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ నాయకులు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు కనీస వేతన సవరణ మండలాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు తక్షణమే గెజిల్ విడుదల అయ్యేలా చూడాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు లక్ష్మయ్య, మొగిలి, రమేష్ రాజు, రవీందర్, శివకుమార్ తదితరులు ఉన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి
అరెస్టు సరికాదు
ములుగు రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూజలు చేయవద్దని, త్రివర్ణ పతాకం ఎగురవేయద్దంటూ అంక్షలు పెడుతుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఆలయ కమిటీ ఎన్నిక
భూపాలపల్లి రూరల్: శ్రీ సీతారామ తెలంగాణ సకల కళల కళాకారుల సంఘం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆలయ కమిటీ నూతన అధ్యక్షుడు పోల్సాని దేవేందర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భౌతు లక్ష్మయ్య, కోశాధికారిగా ఎడ్ల రాము, సహాయ కార్యదర్శిగా తరాల సమ్మక్క, ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి శంకర్, గడ్డం లక్ష్మయ్య, కార్యవర్గ సభ్యులుగా రంగు రవీందర్ గౌడ్, లలిత, అట్కాపురం తిరుపతి, గువ్వ లక్ష్మి, చిలుక రమాదేవిలను ఎన్నుకున్నట్లు తెలిపారు.
సైబర్ బాధితుడికి
చెక్కు అందజేత
భూపాలపల్లి అర్బన్: సైబర్ నేరంతో మోసపోయిన బాధితుడికి రూ.1.20లక్షల చెక్కును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అందించారు. సీఐ నరేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్‌కు చెందిన బొప్పర్తి హరికృష్ణ సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.1,75లక్షలు మోసపోయాడు. బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా రూ.1,54,500 హోల్డ్ చేశారు. దర్యాప్తు జరిపి మొదటి విడతగా రూ.1,20లక్షల చెక్కును కోర్టు ద్వారా ఇప్పించి బాధితుడికి అందజేసినట్లు సీఐ తెలిపారు. బాధితుడికి సకాలంలో రిఫండ్ అందజేయడంలో కృషి చేసిన సైబర్ వారియర్ తిరుపతిని సీఐ అభినందించారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
భూపాలపల్లి అర్బన్: ఏఐఎస్‌ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాకేంద్రంలోని కొమురయ్య భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోత్కు ప్రవీణ్‌కుమార్ హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 30వ తేదీ వరకు ఏఐఎఫ్‌ఐ ఆధ్వర్యంలో క్రీడలు, సెమినార్‌లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల జోసఫ్, నాయకులు పోతుల పవన్, భగత్, రాజేష్, శరణ్య, లావణ్య, అజయ్, వినోద్, రాకేష్, సంపత్ పాల్గొన్నారు.

గెజిట్ విడుదల చేయాలని వినతి