
ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తేనే చైతన్యవంతులు అవుతారని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో ఇంటర్ నేషనల్ యూత్‌డే సందర్భంగా ఇంటెన్ పైడ్, ఐఇసీ క్యాంపును ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణలో యువత పాత్ర ఎంతో ముఖ్యం అన్నారు. యూత్ డే సందర్భంగా ఇంటెన్స్ పైడ్ కార్యక్రమాలు 12 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎయిడ్స్ నియంత్రణపై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించాలి
జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు చేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు సూచించారు. ములుగు జనరల్ ఆస్పత్రిలో ఆస్పత్రి జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించారు. ఈ సందర్భంగా లవకుమార్‌ను ఆయన అభినందిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీ చేయించడం వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలపై మరింత నమ్మకం కలుగుతుందన్నారు. అనంతరం ఆయన టీ హబ్‌ను సందర్శించారు. డెంగీ, మలేరియా రక్త పరీక్షల రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, డెమో సంపత్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు