
ఏజెన్సీలో భారీ వర్షం
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో అధికారులు అప్రమత్తమై అన్ని శాఖల అధికారులు మండల కేంద్రాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మండల పరిధిలోని కొండాయి, ఎలిశెట్టిపల్లి జంపన్నవాగు వద్ద సిబ్బందితో పహారా ఏర్పాటు చేసి రాత్రివేళల్లో వాగు దాటకుండా చర్యలు చేపట్టారు. మరో నాలుగు రోజులు వర్షాలు ఉండడంతో గోదావరి, జంపన్నవాగు, చెరువుల మత్తళ్లను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ