
రైతన్నకు రక్ష!
న్యూస్‌రీల్
రైతుబీమాతో కుటుంబానికి అండ
జిల్లాలో కొత్తగా 1,860 మంది రైతులు
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025
వెంకటాపురం(ఎం): రైతుబీమా పథకానికి దరఖాస్తు గడువు ఈనెల 13వ తేదీతో ముగియనుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 ఆగస్టు 14న ఈ పథకాన్ని ప్రారంభించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. రైతుల పేరుపై ప్రభుత్వమే సంబంధిత కంపెనీకి బీమా ప్రీమియం డబ్బులు 100 శాతం చెల్లిస్తుంది. ప్రతీ ఏడాది పథకం కాలపరిమితి ఆగస్టు 14వ తేదీతో ముగుస్తుంది. వచ్చే ఏడాది (2025–26) కాలానికిగాను రైతుబీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న రైతుల జాబితాతోపాటు 2025 జూన్ 5వ తేదీ వరకు భూభారతి పోర్టల్ ద్వారా కొత్తగా పట్టాదార్ పాస్‌పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అర్హులైన రైతులు ఈ నెల 13వ తేదీలోగా తమ పూర్తి వివరాలతో సంబంధిత ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలి.
జిల్లాలో 86,736 మంది రైతులు
జిల్లాలో 86,736 మంది రైతులు రైతుబీమా పథకంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూన్ 5 వరకు కొత్తగా పాస్‌బుక్కులు పొందిన రైతులతో పాటు గతంలో పాస్‌బుక్కులు పొంది బీమా పథకానికి దరఖాస్తు చేసుకోని రైతులు కూడా ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రతిఏటా ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.2,700ల చొప్పున ప్రీమియం చెల్లిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. రైతులు తమ ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్కు, నామినీ ఆధార్‌కార్డుతో సంబంధిత ఏఈఓలను సంప్రదించాలి. గతంలో బీమాకు నమోదు చేసుకున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
అర్హులైన రైతులందరికీ వర్తింపు..
అర్హులైన ప్రతీ రైతుకు రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం వర్తింపజేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 86,736 మంది రైతులు బీమా పథకంలో కొనసాగుతున్నారు. 2024లోపు పట్టాదారు పాస్‌బుక్కు ఉన్ని 8,131 మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. కొత్తగా పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన 1,860 మంది రైతులతో పాటు గతంలో పాస్‌బుక్కులు ఉన్న 8,131 మంది రైతులు కూడా బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
– సురేశ్ కుమార్, ములుగు జిల్లా వ్యవసాయ అధికారి
అవగాహన కల్పిస్తున్నాం..
కొత్తగా పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవడానికి అవగాహన కల్పిస్తున్నాం. దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్‌బుక్కు జిరాక్స్, పట్టాదారు, నామిని ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులను ఏఈఓలకు అందించి దరఖాస్తు చేసుకోవాలి. రైతుబీమాలో చేర్పులు, మార్పులు కూడా ఈనెల 12లోగా చేసుకోవాలి.
– శైలజ, వ్యవసాయ అధికారి, వెంకటాపురం(ఎం)
●
న్యూస్‌రీల్
రైతుబీమాతో కుటుంబానికి అండ
రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
జిల్లా వ్యాప్తంగా
86,736 మంది రైతులు
కొత్తగా 1,860 మందికి
పట్టాదారు పాస్‌బుక్కులు
దరఖాస్తు చేసుకోని
పాత రైతులకూ అవకాశం
జిల్లాలో కొత్తగా 1,860 మంది రైతులు
ప్రతి సంవత్సరం రైతుబీమా కోసం వ్యవసాయ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అందులోభాగంగానే ఈ ఏడాది ఈనెల 11నుంచి 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2025 జూన్ 5 వరకు పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులు 1,860 మంది ఉన్నారు. పట్టాదారు పాస్‌బుక్కులు పొందిన రైతులంతా బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో రైతుబీమా చేసుకున్న రైతులు ఏవైనా మార్పుల కోసం ఆధార్, నామినిలో మార్పులు చేసుకోవాలంటే ఈనెల 12లోగా సంబంధిత ఏఈఓలకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి మార్పులు చేసుకోవచ్చు. జిల్లాలో 2024–25 సంవత్సరంలో 218 మంది రైతులు మృతిచెందగా, రైతుబీమా కింద ఆయా కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ. 10.90కోట్లు పరిహారాన్ని కుటుంబసభ్యుల ఖాతాల్లో జమచేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు.

రైతన్నకు రక్ష!

రైతన్నకు రక్ష!

రైతన్నకు రక్ష!

రైతన్నకు రక్ష!