
పింఛన్లు తక్షణమే పెంచాలి
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను తక్షణమే పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి చాతాళ్ల రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం మల్లంపల్లి మండలకేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు, వితంతువులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పింఛన్ల పెంపు కోసం సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మడిపెల్లి శ్యాంబాబు, కార్తిక్, సతీశ్, రాజేందర్, మొగిలి, నరేందర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
చాతాళ్ల రమేశ్