
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర అప్పయ్య కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ వాసంతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలవిసర్జన తరువాత చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ గీత, ఎంఈఓ నెహ్రూనాయక్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి మదన్‌మోహన్‌రావు, డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ హిమబిందు హెచ్‌ఎం ఉమ ల్గొన్నారు.
మంచి పేరు తీసుకురావాలి
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌తోపాటు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. ఇనిస్టిట్యూట్‌లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం నూతన పీజీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్‌లో ఆయన మాట్లాడారు. నిట్‌లోని అత్యుత్తమ బోధనను అధ్యయనం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎమ్మెసీలో అందజేస్తున్న విద్యాబోధన, ల్యాబ్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్‌కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
రుద్రతత్వమే విశ్వశక్తి
హన్మకొండ కల్చరల్ : రుద్రతత్వమే విశ్వశక్తి అని, భగవంతుడి ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. శ్రావణమాసం మూడో సోమవారం ఉదయం రుద్రేశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. సాయంత్రం సహస్రనామార్చనలు ప్రదోషకాలపూజలు భజనలు జరిగాయి. ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దూర విద్య ప్రవేశాల
గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూర విద్యాకేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఓరియెంటేషన్ కోర్సుల్లో 2025–2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేశ్‌లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్‌సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్‌ఐఎస్సీ కోర్సులతోపాటు మరో తొమ్మిది డిప్లొ మా, 14 సర్టిఫికెట్, ఏడు ఓరియంటేషన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సర్టిఫికెట్‌లు, ఫొటో జత చేసి కోర్సు రుసుం ఆన్‌లైన్‌లోగానీ, దూరవిద్యాకేంద్రంలో క్యూఆర్ స్కాన్‌ద్వారా చెల్లించవచ్చని తెలిపా రు. కోర్సులు, ఫీజులు మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు.
ఎన్‌జీఓతో ఆర్ట్స్‌కాలేజీ ఒప్పందం
కేయూ క్యాంపస్: మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు అన్నిరంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా లాంచ్ గర్ల్స్ ఎన్‌జీఓతో ఒప్పందం చేసుకున్నట్లు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి సోమవారం తెలిపారు. ఈ సంస్థ మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.