
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ములుగు రూరల్: ములుగు ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి దనసరి సీతక్క ఆదేశించారు. సోమవారం కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న రోగులను పలకరించి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల క్యాన్సర్ ఆపరేషన్ అయిన వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనరల్ విభాగంలో మైరుగైన వైద్యసేవలకు బిల్డింగ్ పైఅంతస్తు నిర్మాణం చేపడతామమని చెప్పారు. ఆస్పత్రిలో అన్ని రకాల ఆపరేషన్లు జరిగే విధంగా సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అసిస్టెంట్ డైరెక్టర్ గఫర్, ఆర్‌ఎంఓ సంపత్, సిబ్బంది పాల్గొన్నారు.
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన
మంత్రి సీతక్క
అన్ని రకాల ఆపరేషన్లు జరిగే విధంగా సదుపాయాలు కల్పిస్తామని హామీ