
హక్కుల సాధనకు ఉద్యమించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గీత కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు పులి నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 18 వరకు చేపట్టిన అమరుల యాది కార్యక్రమం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై గీత కార్మికులు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. వర్దెల్లి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ మాట్లాడుతూ..ఏజెన్సీలో రద్దయిన సొసైటీలు పునరుద్ధరించి గీత కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అన్ని సొసైటీలకు చెట్ల పెంపకానికి భూమి కేటాయించాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతీ గీత కార్మికుడికి ఎటువంటి షరతులు లేకుండా వృత్తి పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈసందర్భంగా ఇటీవల మృతి చెందిన తాడ్వాయి గ్రామానికి చెందిన గౌని అంజయ్య, తమ్మల సమ్మయ్యగౌడ్ స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు గుండు శివశంకర్, పులి రవిగౌడ్, గడ్డం శ్రీధర్, బెల్లంకొండ రోశయ్య గౌడ్, మొక్క రాజు, కక్కర్ల వెంకటేశ్, మొక్క నరేశ్, చెవుగాని రఘు, గౌని మధు, పులి రాజు, పాలకుర్తి జగన్నాథం, బెల్లంకొండ రాజు, పాలకుర్తి ఉపేందర్, తీర్రి సంపత్, వడ్లకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీలో గీత కార్మికుల సొసైటీలు
పునరుద్ధరించాలి
అమరుల యాది కార్యక్రమంలో
గీత కార్మిక సంఘం నాయకులు