
మల్టీ డిపార్ట్‌మెంట్ టీమ్‌ల ఏర్పాటు
భూపాలపల్లి అర్బన్: బొగ్గు ఉత్పత్తి పెంపు, యంత్రాల పనితీరు, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలను తెలియజేసేందుకు యాజమాన్యం మల్టీ డిపార్ట్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మల్లీడిపార్ట్‌మెంట్ టీమ్‌ల ఏర్పాటు కార్యక్రమాన్ని జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఏరియాలో ఉద్యోగులందరికీ ప్రస్తుతం సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, యంత్రాల పనితీరు, ఉత్పత్తి వ్యయం విషయాలను గనులు, వివిధ శాఖల వారీగా తెలియజేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మల్టీ డిపార్ట్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ గనులు, విభాగాల నుంచి ఎంపికై న టీం సభ్యులకు అన్ని గనులు, విభాగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలు తెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జోతి, ఎర్రన్న, డాక్టర్ పద్మజ, ప్రసాద్, భిక్షమయ్య, రమాకాంత్, అరుణ్‌ప్రసాద్, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు రమేష్, హుస్సేన్ పాల్గొన్నారు.