
పూజారుల గదులను పట్టించుకోరూ?
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో నిర్మించిన పూజారుల గదులు మరమ్మతులకు చేరుకున్నాయి.గతంలో మహాజాతర సందర్భంగా సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారుల కోసం దేవాదాయ శాఖ ఆవరణంలో ప్రత్యేక గదులు నిర్మించారు. జాతర సమయాల్లో పూజారులు గదుల్లో ఉండి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గదులు మరమ్మతుకు రావడంతో పూజారులకు మళ్లీ పాత తొమ్మిది గదుల రేకుల షెడ్డు దికై ్కంది. కొన్ని గదుల కిటీకిలు, తలుపులు పగిలిపోయాయి.అలాగే టైల్స్ సైతం దెబ్బతిన్నాయి. దేవాదాయశాఖ అధికారులు పూజారుల గదులను పట్టించుకోకపోవడంతో మరమ్మతుకు చేరుకున్నాయి. అమ్మవార్లను కొలిచే పూజారుల గదులే ఇలా ఉంటే భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయో సంబంధిత అధికారులకే తెలియాల్సి ఉంది. ఇటీవల పూజారుల కోసం నూతన భవనం నిర్మించారు. కానీ మహాజాతర సమయంలో పూజారులకు గదులు చాలా అవసరం. జాతర సమయంలో భక్తుల రద్దీకి పూజారులు బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. గద్దెల దగ్గర గదులు ఉండడంతో పూజా కార్యక్రమాలకు, అధికారులకు వారు అందుబాటులో ఉంటారు. దేవాదాయశాఖ అధికారులు స్పందించి గదులకు మరమ్మతులు చేపట్టాలని పూజారులు కోరుతున్నారు.