
దేశభక్తి కలిగి ఉండాలి
ములుగు రూరల్ : ప్రతీ పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్‌కుమార్ శ్రీవాత్సవ, సెకండ్ ఇన్ కమాండెంట్ జెగ్‌షేర్, డిప్యూటీ కమాండెంట్ ఎస్‌ిపీ రజిత పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బెటాలియన్ ఆధ్వర్యంలో ఆదివారం సీఆర్‌పీఫ్ అధికారులు డీఎల్‌ఆర్ నుంచి గాంధీ విగ్రహం వరకు హర్‌ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దేశ సౌరభౌమత్వాన్ని కాపాడేందుకు దేశభక్తి కలిగి ఉండాలని వివరించారు. ఎందరో పోరాట యోధులు స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆ విష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమ ంలో 39 బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
నియామకం
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మండలంలోని మేడారం సమీపంలో గల రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దండుగుల మల్లయ్యను తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఐలుమల్లు ఆదేశాల మేరకు ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్.. మ
ల్లయ్యకునియామక పత్రం అందజేశారు. మల్లయ్య మాట్లాడుతూ వడ్డెర కులస్తుల సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నా రు. రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన సంఘ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రేపటితో రైతుబీమా
గడువు ముగింపు
భూపాలపల్లి రూరల్ : అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం రెన్యూవల్ గడువు ఈ నెల 12వ తేదీతో ముగయనుంది. జిల్లాలోని రైతులంతా రైతుబీమాను రెన్యూవల్ చేసుకోవాలని, అదేవిధంగా కొత్త పట్టా పాస్‌బుక్ పొందిన రైతులు సైతం సంబంధిత రైతు వేదికల్లో ఏఈఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయశాఖ అధికారి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18నుంచి 59 ఏళ్ల వయసు గలవారు 2025, జూన్ వరకు భూభారతి ద్వారా పట్టా పాస్‌బుక్ పొందిన రైతులు అర్హులని పేర్కొన్నారు. రైతులు ఏదైనా ప్రమాదం, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల మరణించిన పక్షంలో నామినికి ఎల్‌ఐసీ ద్వారా రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తారని వివరించారు. ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, ప్రతి ఏటా ఆగస్టు 15నుంచి తదుపరి ఆగస్టు 14 వరకు బీమా చెల్లుబాటులో ఉంటుందని వెల్ల డించారు. రెన్యువల్ లేదా కొత్తగా నమోదు కావాలనుకునే రైతులు సమీపంలోని ఏఈఓ లేదా రైతు వేదికలో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని బాబు సూచించారు.
42శాతం రిజర్వేషన్లు
అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రానికి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు.

దేశభక్తి కలిగి ఉండాలి