
యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించాలి
ములుగు రూరల్: సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించాలని ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహయ కార్యదర్శి అతిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం హెల్ప్‌లైన్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ యూనివర్సిటీ గత సంవత్సరమే ప్రారంభమైందని తెలిపారు. అయినా ప్రభుత్వం సొంత భవనం నిర్మించకుండా అద్దె భవనంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు. యూనివర్సిటీలో గిరిజనులకు 3 సీట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూనివర్సిటీకి సొంత భవనం నిర్మించకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామెర కిరణ్, రవితేజ, తోకల రవి, భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి అతిక్