
ముందస్తు రాఖీ వేడుకలు
ములుగు రూరల్ : జిల్లాకేంద్రంలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడి చైతన్య, సరిత, శ్రీవాణి, సునీత, రమేష్, శంకర్, తేజస్వీనిదేవి, హర్ష, సునీల్, పద్మ తదితరులు పాల్గొన్నారు.
మల్లంపల్లి బ్రిడ్జి పరిశీలన
ములుగు రూరల్: జాతీయ రహదారిపై మల్లంపల్లి వద్ద ఉన్న పాత బ్రిడ్జి కుంగిపోవడంతో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అక్కడికి చేరుకుని పనులను పరిశీలించినట్లు తెలిపారు. వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్‌పాషా, చింతనిప్పుల భిక్షపతి, నల్లెల్ల భరత్, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు రాఖీ వేడుకలు