
కారు.. ఆటో ఢీ
● ఎనిమిది మందికి గాయాలు
ఏటూరునాగారం: ఓ కారు అదపుతప్పి కూలీ పనులకు వెళ్తున్న వారి ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటన మండల పరిధిలోని ఏటూరునాగారంలో చోటుచేసుకుంది. ఈ క్రమంలో మొత్తంగా 8మంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని కొండాయి వద్ద బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం అస్సాం నుంచి కూలీలు వచ్చారు. బ్రిడ్జి వద్దకు పనులు చేసేందుకు వెళ్తుండగా హనుమకొండ నుంచి వెంకటాపురం మండలం ఆలుబాక వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను శుక్రవారం మండలం చిన్నబోయినపల్లి ప్రధాన రోడ్డుపై ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న అరుగురు కూలీలకు గాయాలు కాగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 8 మందిని హుటాహుటిన 108లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఇందులో కారులో ప్రయాణిస్తున్న ఆలుబాకకు చెందిన సాలురి యశ్వంత్‌కు తీవ్రగాయంకాగా కావడంతో అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌కు రెఫర్ చేశారు. మిగతా ఏడుగురికి గాయాలకు చికిత్సలు పొందారు.

కారు.. ఆటో ఢీ