
సంక్షేమ పథకాల అమలు బీజేపీతోనే సాధ్యం
● పార్టీ జిల్లా కార్యదర్శి నరేష్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి భర్తపురం నరేష్ అన్నారు. మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శుక్రవారం ప్రజలకు వివరించారు. కరపత్రాల పంపిణీతో పాటు ఇంటింటికీ డోర్ స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామపంచాయతీ ట్రాక్టర్లు, పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులకు రూ.6 వేలు ఖాతాల్లో జమచేయడం వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి మోసం చేస్తుందన్నారు. 42శాతం రిజర్వేషన్లలో ముస్లింలకు 10శాతం ఇచ్చేందుకు కుట్రపని బీసీలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఇంటింటి ప్రచారం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొర్నెబెల్లి సేనాపతి, పిన్నింటి సంజీవరెడ్డి, అలెం రాకేష్, శ్రీకాంత్, వెంకన్న, సందీప్ పాల్గొన్నారు.