
ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి
ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవి
ములుగు రూరల్: నేడు జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఆదివాసీల ఐక్యత చాటుకోవాలన్నారు. ఆదివాసీ ఉద్యోగులు, యువత, మేధావులు హాజరుకావాలన్నారు. ఉదయం 11 గంటలకు డీఎల్‌ఆర్ ఫంక్షన్‌హాల్ నుంచి వైద్యారోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం సమావేశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం రవికాంత్, నారాయణ, నాగేశ్వర్‌రావు, కుమారస్వామి, లక్ష్మీనారాయణ, బాబురావు, కృష్ణ భాస్కర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.